
భద్రాచలం, వెలుగు : భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మంగళవారం దుమ్ముగూడెం మండలంలో పర్యటించారు. వీరభద్రారం, నడికుడి గ్రామాల్లో రైతులు, కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. వారి సమస్యలపై ఆరా తీశారు. అంతకుముందు తాలిపేరు కాల్వలో తూటికాడలు, గుర్రపుడెక్క మొక్కలు, పూడిక తీత పనులను పరిశీలించారు.
పూడిక పనులకు నిధులు సరిపోకపోతే జిల్లా మంత్రులతో మాట్లాడి నిధులు తీసుకొస్తానని ఇంజినీర్లతో అన్నారు. వీరభద్రారంలోని ప్రభుత్వ స్కూల్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. స్టూడెంట్స్ ఆరోగ్యం, చదువుతున్న తీరును పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఈఈ జానీ ఉన్నారు.