శుభలేఖ పంపండి..సీతారాముల తలంబ్రాలు అందుకోండి

శుభలేఖ పంపండి..సీతారాముల తలంబ్రాలు అందుకోండి

వెలుగు: ఆదర్శ దంపతులు సీతారాముల కల్యాణ తలంబ్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో విశిష్టత ఉంది. ఇకపై పెళ్లి శుభలేఖను భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానికి పంపితేచాలు ఆ నూతన వధూవరులకు శ్రీరాముడి ఆశీస్సులు అందిస్తూ ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు ఉచితంగా అందించనున్నారు. పోస్టల్​డిపార్ట్​మెంట్​ద్వారా పంపేందుకు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది ఉగాది నుంచే ప్రారంభించనుంది. తితిదే తరహాలో శుభలేఖ పంపిన ప్రతీ వారికి నేరుగా ప్రసాదం, తలంబ్రాలు పంపనున్నారు. లాభాపేక్ష లేకుండా తలంబ్రాలు పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో తాళ్లూరి రమేశ్‍బాబు తెలిపారు.