
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి మూలవరులను శుక్రవారం బంగారు కవచాలతో అలంకరించారు. విశేష హారతులు సమర్పించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించాక స్వర్ణకవచాలంకరణ చేశారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనం జరిగింది. లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చన, విష్ణుసహస్రనామ పారాయణం భక్తిప్రవత్తులతో చేశారు. కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం నిర్వహించి, భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం దర్బారు సేవ అనంతరం సీతారామచంద్రస్వామికి సంధ్యాహారతిని సమర్పించారు.