
భద్రాచలం,వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి రూ. 1.52 కోట్ల ఆదాయం వచ్చింది. బుధవారం చిత్రకూట మండపంలో భద్రత నడుమ హుండీలు తెరిచి ఆలయ సిబ్బందితో లెక్కించినట్లు ఈవో దామోదర్‌రావు తెలిపారు. భక్తుల సమర్పించిన కానుకల్లో రూ.1,52,59, 499 నగదుగా, బంగారం 89 గ్రాములు, 1.20 గ్రాముల వెండి వచ్చింది. భక్తులు విదేశీ కరెన్సీని కూడా హుండీలో వేసినట్టు ఈవో చెప్పారు.