పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని గట్టాయిగూడెంకు చెందిన కేటీపీఎస్ ఉద్యోగి మీసాల సునీల్ కుమార్(45) డెడ్‌బాడీ అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేటీపీఎస్ లో ఉద్యోగం చేసే సునీల్ కుమార్ మూడు రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో పాటు ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు తలుపులు తీసి చూడగా సునీల్ కుమార్ డెడ్‌బాడీ బెడ్రూమ్ లో కుళ్లిపోయి కనిపించింది. డెడ్‌బాడీని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్సై టి నాగరాజు తెలిపారు.
