బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి.. మహబూబ్ నగర్ రూరల్ లో ఘటన

బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి.. మహబూబ్ నగర్ రూరల్ లో ఘటన

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: కర్నాటక రాష్ట్రం దేవసుగురు ఆలయంలో స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. రూరల్​ ఎస్సై అబ్దుల్​ వహీద్​ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలకేంద్రానికి చెందిన హరి (35) కర్నాటక రాష్ట్రం దేవసుగురు ఆలయంలో దర్శనం చేసుకున్న అనంతరం రాయచూరు నుంచి హైదరాబాద్​కు ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. మండలంలోని కోడూరు సమీపంలో సీట్​లో నుంచి కింద పడిపోగా డ్రైవర్  వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చాడు. సదరు వ్యక్తిని పరీక్షించిన 108 సిబ్బంది అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. అనంతరం డెడ్​బాడీని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మృతుడి తండ్రి హరి సాయిరాంకు పోలీసులు సమాచారం అందించారు.