V6 News

గ్రీన్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్లాన్ : కలెక్టర్ జితేశ్

గ్రీన్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్లాన్ : కలెక్టర్ జితేశ్
  •     భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​

భద్రాద్రికొత్తగూడెం,వెలుగు:  పంచాయతీ ఎన్నికల్లో గ్రీన్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ తెలిపారు.  గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు  అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 

మంగళవారం మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై  పలు శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామగ్రిని ప్రీసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్​లో అందజేసి పలు సూచనలు చేయాలన్నారు. ఈనెల 11న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రతి రెండు గంటలకు ఓసారి పోలింగ్ శాతాన్ని టీ పోల్ యాప్ లో నమోదు చేయాలని చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొన్నారు. 

పోలింగ్ సజావుగా జరిగేందుకు ప్రీసైడింగ్ అధికారులకు రిటర్నింగ్, జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ లు, ఇతర సిబ్బంది సహకరించాలన్నారు.  మరో రెండు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో కొన్ని గ్రీన్ పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని సూచించారు.   సమావేశంలో సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకులు లావణ్య, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీపీవో సుధీర్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మార్కెటింగ్ శాఖ అధికారి నరేందర్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ  పాల్గొన్నారు.