కాశీబుగ్గ, వెలుగు: భద్రకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి బ్రహోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం నుంచి గురువారం వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి, తెలుగు విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్ గౌరీశంకర్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మదన్మోహన్ అమ్మవారికి పట్టు చీరలు, పూజాద్రవ్యాలు సమర్పించారు.

