వరంగల్ భద్రకాళీ చెరువు.. మళ్లీ మురుగుమయం

వరంగల్ భద్రకాళీ చెరువు.. మళ్లీ మురుగుమయం

భద్రకాళీ చెరువు బ్యూటీఫికేషన్  పనుల్లో వేగం తగ్గడంతో మళ్లీ పాత కథే రిపీట్ అవుతోంది. చెరువు కట్టను ఆనుకుని ఉన్న ప్లాట్లకు చెందిన వారు మురుగు నీటిని బొందివాగులోకి వదలకుండా భద్రకాళీ చెరువు కట్టకు గండి కొట్టి జలాశయంలోకి వదులుతున్నారు. ఎండాకాలంలో చెరువును ఖాళీ చేసి అందులోని నీటిని వదిలేశారు.

 ఇక బ్యూటీఫికేషన్ చేసి మంచి నీటిని నింపడమే మిగిలింది.  ఈ మధ్య పనుల వేగం తగ్గింది. దీంతో  మురుగును మళ్లీ చెరువులోకి వదులుతున్నారు. ఇలాగే కొనసాగితే పరిసరాలు కంపుగా మారి మళ్లీ పాత మురుగు చెరువులాగానే మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. -  ఫోటోగ్రాఫర్​, వెలుగు వరంగల్​