టిల్లు చెప్పిన భాగ్ సాలే బ్యాక్​ స్టోరీ

టిల్లు చెప్పిన భాగ్ సాలే బ్యాక్​ స్టోరీ

శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ  క్రైమ్ కామెడీ మూవీని అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. ‘వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే’ పేరుతో ఈ మూవీ కాన్సెప్ట్‌‌ టీజర్‌‌‌‌ను బుధవారం విడుదల చేశారు. దీనికి హీరో సిద్ధు జొన్నలగడ్డ.. ‘డీజే టిల్లు’ స్టయిల్‌‌లో వాయిస్‌‌ ఓవర్‌‌‌‌ ఇచ్చాడు.  ‘శాలి శుక గజ’ అనే ఒక డైమండ్ రింగ్ ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ల లైఫ్‌‌ రిచ్ అవడంతో పాటు సమస్యల్లో కూడా పడతారు. పురాతన డైమండ్.. బ్రిటీషర్స్,  ప్రెంచ్ వాళ్లు, నిజాం నవాబులను దాటుకుని హీరో చేతికి ఎలా వచ్చింది అనేది సిద్ధు వాయిస్‌‌ ఓవర్, కార్టూన్ విజువల్స్ ద్వారా చెప్పారు. ఆ డైమండ్ వల్ల హీరో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడనేది మెయిన్ కాన్సెప్ట్‌ అని అర్థమవుతోంది. రాజీవ్ కనకాల, జాన్ విజయ్, వర్షిణి సౌందరాజన్, నందిని రాయ్, వైవా హర్ష, సత్య, సుదర్శన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జూలై 7న సినిమా విడుదల కానుంది.