
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీలీల కీలకపాత్ర పోషిస్తోంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. గురువారంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని ప్రకటిస్తూ, స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. పూజా కార్యక్రమం నుండి షూటింగ్ పూర్తయ్యే వరకు ‘భగవంత కేసరి’ జర్నీని ఇందులో చూపించారు.
ప్యాషనేట్ టీమ్ 8 నెలల పాటు ఈ చిత్రం కోసం వర్క్ చేసిందని, 24 బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో, 12 మాసివ్ సెట్లలో షూటింగ్ జరిగిందని చెప్పారు. వీడియో చివరిలో ‘బ్రో.. ఐ డోంట్ కేర్’ అంటూ బాలకృష్ణ చెప్పిన పవర్ ప్యాక్డ్ డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 19న సినిమా విడుదల కానుంది.