ప్రతి సీన్‌‌‌‌కు నిలబడి చప్పట్లు కొడతారు : బాలకృష్ణ

ప్రతి సీన్‌‌‌‌కు నిలబడి చప్పట్లు కొడతారు : బాలకృష్ణ

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలకపాత్ర పోషించారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌లో బాలకృష్ణ మాట్లాడుతూ ‘ దేవీ శరన్నవరాత్రులు పర్వదినాల్లో నా 108వ సినిమా విడుదలవడం అదృష్టం.

అనిల్ నా అభిమానిగా కథను రాశాడు. ఈ సినిమా కోసం గెటప్ దగ్గర నుంచి యాస వరకు స్పెషల్ కేర్ తీసుకున్నా. సినిమాతో పాటు ఇందులోని పాత్రలన్నీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.  ప్రతి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. శ్రీలీల బోర్న్ ఆర్టిస్ట్. మా ఇద్దరి మధ్య ఎన్నో సీరియస్ సీన్స్ ఉంటాయి. మేమే గ్లిజరిన్ వాడకుండా నటించాం. ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరూ కంటతడి పెడతారు.

ప్రతి సీన్‌‌‌‌కు నిలబడి చప్పట్లు కొట్టాల్సిందే.  మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంత అద్భుతంగా వచ్చింది. అలాగే కాజల్, అర్జున్ రాంపాల్  కీలక పాత్రలు పోషించారు. తమన్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. ఏ సినిమాకైనా దర్శకుడు, సినిమాటోగ్రాఫర్,  ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ నాలుగు పిల్లర్లు లాంటి వారు. దీనికి అందరూ సమన్యాయం చేశారు’ అని చెప్పారు. విజ్జి పాపగా అందర్నీ ఆకట్టుకుంటానని చెప్పింది శ్రీలీల. అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘నవ్వించే నేను ఈసారి ఎమోషన్‌‌‌‌ను చూపించబోతున్నా. చాలా రోజులు గుర్తుపెట్టుకునేలా పాత్రలు ఉంటాయి’ అన్నాడు. సినిమాపై సక్సెస్‌‌‌‌పై నమ్మకంగా ఉన్నామని నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు.