దసరాకు రావడం పక్కా

దసరాకు రావడం పక్కా

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భగవంత్ కేసరి’ సినిమా నుంచి ఇప్పటికే  ‘గణపతి బప్ప మోరియా’ అంటూ గణేష్ పాటను విడుదల చేసి నందమూరి ఫ్యాన్స్‌‌లో జోష్‌‌ని నింపారు. ఓ వైపు ఈ పాట మిలియన్ల వ్యూస్‌‌తో దూసుకుపోతుంటే, మరోవైపు సినిమా రిలీజ్ విషయంలో కన్ఫూజన్ ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.  

దసరా సందర్భంగా అక్టోబర్ 19న సినిమా విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే  ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా అనుకున్న సమయానికి రాకపోవచ్చు అని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు అరెస్టు కేసు విషయంలో  బాలకృష్ణ  చాలా బిజీగా ఉన్నారని దీంతో సినిమా పోస్ట్ పోన్ అయ్యే చాన్స్ ఉందంటూ గాసిప్స్ మొదలయ్యాయి. 

అలాగే దసరా రేసులో రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, విజయ్ ‘లియో’ చిత్రాలు కూడా రిలీజ్ అవుతుండటంతో ఈ చిత్రాన్ని కొన్ని రోజులు వాయిదా వేయాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.  అయితే వీటన్నింటిని కొట్టిపారేస్తూ విడుదల విషయంలో టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ‘భగవంత్ కేసరి’ అక్టోబర్ 19కే రిలీజ్ అవుతుందని కన్ఫామ్‌‌ చేసింది.  సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.