Bhairavam OTT: ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bhairavam OTT: ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ముగ్గురు తెలుగు హీరోలు నటించిన భైరవం ఓటీటీలోకి వస్తోంది.  మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన మూవీ జులై 18 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని నేడు (జులై 8న) జీ5 ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుందని జీ5 తెలిపింది.

మే 30న థియేటర్లలో విడుదలైన భైరవం మూవీ తమిళ సూపర్ హిట్ గరుడన్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. అయితే, భైరవం సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. సినిమా స్టోరీ రొటీన్‌గా ఉన్న టేకింగ్‌లో కాస్తా కొత్తదనం కనిపించిందన్నారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌, పెన్ స్టూడియోస్‌ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం, టాప్ టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమాను సుమారుగా రూ.35 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. దాదాపు రూ.19కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 75.94% రికవరీ చేసింది. 

భైరవం కథ:

తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపురం గ్రామం. అక్కడి వారాహి ఆలయ భూములను కాపాడే ముగ్గురు ప్రాణస్నేహితులు. గజపతి వర్మ (మంచు మనోజ్), గజపతి వర్మ దగ్గర పనిచేసే శ్రీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్).  గజపతి వర్మ స్నేహితుడు వరద (నారా రోహిత్). ఒకరికోసం ఒకరు అనేలా ఉంటారు.

వారాహి ఆలయ ధర్మకర్తగా గజపతి వర్మ నాయనమ్మ నాగరత్నమ్మ (జయసుధ) ఉంటుంది. అయితే, వారాహీ అమ్మవారి గుడికి చెందిన భూముల మీద దేవాదాయ శాఖ మంత్రి (శరత్ లోహితస్య) కన్నేస్తాడు.

ఈ క్రమంలో అనూహ్యంగా గజపతి వర్మ నాయనమ్మ నాగరత్నమ్మ చనిపోతుంది. ఉన్నట్టుండి గజపతి వర్మ దగ్గర పనిచేసే శ్రీను ధర్మకర్త అవుతాడు. అసలు ఓ పనివాడు ధర్మకర్త అవ్వడం వెనుక ఎవరున్నారు? వెయ్యి కోట్ల విలువైన ఆ భూమిని కాజేయాలని ఎవరెవరు ప్రయత్నిస్తారు? ప్రాణస్నేహితులుగా ఉండే వారి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తాయి?

స్నేహితుడిని ఎవరైనా చిన్నమాట అంటే ఊరుకోని గజపతి... వరదా మీద ఎటాక్ జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు? గజపతి వర్మ భార్య నీలిమ (ఆనంది), బావమరిది పులి (సందీప్ రాజ్), శ్రీను ప్రేమించిన అమ్మాయి వెన్నెల (అదితి శంకర్), వరద భార్య పూర్ణిమ (దివ్యా పిళ్లై), థియేటర్ రన్ చేసే నాగరాజు (అజయ్) సినిమాలో వీరి పాత్రలు ఎలాంటివి? కథలో ఒక్కో మనిషి వెనుక ఉన్న అసలు ముసుగు ఏంటనేది మిగతా స్టోరీ.

  • Beta
Beta feature