జీవిత సారాన్ని తెలిపేలా ‘ఆలోచన’ సినిమా నుంచి భజగోవిందం సాంగ్ రిలీజ్

జీవిత సారాన్ని తెలిపేలా ‘ఆలోచన’ సినిమా నుంచి భజగోవిందం సాంగ్ రిలీజ్

పి.ఎస్.జె ఫిలిమ్స్ బ్యానర్‌‌‌‌పై ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మిస్తున్న చిత్రం ‘ఆలోచన’.  సురేందర్ చాచా  దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి.వి. నారాయణరావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘భజగోవిందం’ అంటూ సాగే పాటను శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి విడుదల చేసి మూవీ టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ అందించారు.

వృద్ధాప్యంలో స్నేహం విలువ,  జీవిత సారాన్ని ప్రతిబింబించే ఈ పాటను   ఆది శంకరాచార్యులు రచించిన ‘మోహముద్గర’ (భజగోవిందం)లోని తత్వాన్ని ఆధారంగా తీసుకుని తెలుగులో రూపొందించారు.  ప్రతాప్ రాజులపల్లి తెలుగు అనువాదం అందించగా, వియాన్ సంగీతం సమకూర్చారు. మంగ్లీ, వియాన్ ఈ పాటను ఆలపించారు. త్వరలోనే ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు రానుంది.