వివేక్​ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడంపై సీఎంకు థాంక్స్

వివేక్​ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడంపై సీఎంకు థాంక్స్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గంలో వివేక్ వెంకటస్వామికి స్థానం కల్పించినందుకు బంధు సొసైటీ హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం సొసైటీ కార్యవర్గ సమావేశం చిక్కడపల్లిలో జరిగింది. సొసైటీ అధ్యక్షుడు పల్లెల వీరస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు పెద్దపీట వేస్తోందన్నారు. మంత్రివర్గంలో వివేక్ వెంకటస్వామితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వశపాక నరసింహా పాల్గొన్నారు.