ఆగస్టు 21న భారత్ బంద్

ఆగస్టు 21న భారత్ బంద్

ఎస్సీ,ఎస్టీలను రాజ్యాధికారానికి దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు. వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు కాదని..బీజేపీ తీర్పు అని విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ సర్వయ్య,కో కన్వినర్ చెన్నయ్య ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. 

ఈ సందర్బంగా మాట్లాడిన సభ్యులు..ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆగస్టు 21న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు .. ఎస్సీ,ఎస్టీ సోదరులు ఇప్పటికైనా మేల్కొని వర్గీకరణ వ్యతిరేక నినాదంతో పెద్ద ఎత్తున ఆగస్టు 21న భారత్ బంద్ లో పాల్గొని తమ సత్తా ఏంటో  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు.