రైతుల నిరసనలంటే దోపిడీ ప్రభుత్వానికి నచ్చట్లే

రైతుల నిరసనలంటే దోపిడీ ప్రభుత్వానికి నచ్చట్లే

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో రైతులు ఆందోళనలను కొసాగిస్తున్నారు. ఈ చట్టాలు ప్రవేశపెట్టి ఏడాది కాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో వీటిని వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం భారత్ బంద్ కు పిలుపును ఇచ్చింది. 

భారత్ బంద్ కు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, టీడీపీలతో పాటు లెఫ్ట్ పార్టీలు, స్వరాజ్ ఇండియా పార్టీ మద్దతు తెలిపాయి. ఈ బంద్ చాలా చోట్ల ప్రశాంతంగా సాగుతోంది. అయితే తమిళనాడులో మాత్రం కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో బంద్ లో పాల్గొన్న లెఫ్ట్ పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. భారత్ బంద్ పై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. బంద్ కు మద్దతు తెలిపిన రాహుల్.. కేంద్ర తీరుపై మండిపడ్డారు. 'రైతులు అహింసాత్మక పద్ధతిలో చేస్తున్న నిరసనలు ఇంకా విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నిరసనలు అంటే ఈ దోపిడీ ప్రభుత్వానికి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇవ్వాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చాం' అని రాహుల్ ట్వీట్ చేశారు.

see more news

హైటెక్ కాపీ.. బ్లూటూత్ చెప్పులతో ఎగ్జామ్‌కు అటెండ్

ఫుడ్ డెలీవరీ డ్రోన్ పై పక్షి దాడి.. వైరల్ అవుతోన్న వీడియో