పెండింగ్‌ ఆర్డర్లు పూర్తి చేస్తం: భారత్ బయోటెక్

V6 Velugu Posted on Nov 30, 2021

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  కొవాగ్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎగుమతులను  ప్రారంభించామని  భారత్ బయోటెక్ ప్రకటించింది.  పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఆర్డర్లను ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామని పేర్కొంది. ‘పెండింగ్​ ఆర్డర్లను ఈ నెల నుంచే ఎగుమతి చేయడం ప్రారంభించాం. రానున్న నెలల్లో మరిన్ని ఎగుమతులు చేస్తాం. కొవాగ్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎమర్జెన్సీ అప్రూవల్స్ ఇస్తున్న దేశాలు పెరుగుతుండడంతో, ఈ అదనపు దేశాలకు డిసెంబర్ నుంచి ఎగుమతులు స్టార్ట్ చేస్తాం’ అని భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బయోటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్విటర్ ద్వారా ప్రకటించింది. కానీ, ఏయే దేశాలకు ఎగుమతులు స్టార్ట్ చేసిందో, డిసెంబర్ నుంచి ఏ దేశాలకు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతాయో కంపెనీ పేర్కొనలేదు. ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతిచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కరోనాతో జరుగుతున్న పోరులో కొవాగ్జిన్ కూడా ఇక భాగం పంచుకుంటుంది’ అని  ఈ కంపెనీ ట్వీట్ చేసింది.  కోవిషీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేస్తున్న సీరమ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ కూడా  వ్యాక్సిన్ ఎగుమతులను స్టార్ట్ చేశామని కిందటి వారం ప్రకటించింది.

Tagged corona vaccine, Covaxin, Bharat Biotech, Omicron variant

Latest Videos

Subscribe Now

More News