కొత్త వేరియంట్లను కొవాగ్జిన్ ఎదుర్కుంటది

కొత్త వేరియంట్లను కొవాగ్జిన్ ఎదుర్కుంటది

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్లపై భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకటించింది. యూకేలో గుర్తించిన ఆల్ఫా, ఇండియాలో గుర్తించిన డెల్టా వేరియంట్లపై కొవాగ్జిన్ పనీతీరు బాగుందని వివరించింది. కొవాగ్జిన్ వేసుకున్న వాళ్లలో యాంటీబాడీలు బాగా డెవలప్ అయ్యాయని తెలిపింది. ఇప్పటికే ప్రకటించిన సెకండ్ ఫేజ్ ట్రయల్స్‌‌లో కొవాగ్జిన్ సేఫ్ అని భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. పబ్లిష్ చేయని థర్డ్ ఫేజ్ ట్రయల్స్‌‌లోనూ మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపింది. కరోనా సివియారిటీ ఎక్కువున్న వాళ్లపై కొవాగ్జిన్ 100 శాతం సమర్థవంతంగా, ప్రభావవంతంగా పనిచేస్తోందని వివరించింది. సింప్టమాటిక్ కేసుల్లో 78 శాతం, అసింప్టమాటిక్ కేసుల్లో 70 శాతం ఎఫికసీ ప్రదర్శించిందని తెలిపింది.