18న 'భారత్ గౌరవ్' ట్రైన్ ప్రారంభం

18న 'భారత్ గౌరవ్' ట్రైన్ ప్రారంభం
  • సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్ 

హైదరాబాద్, వెలుగు: దేశంలోని ప్రముఖ ప్రదేశాలను, దేవాలయాలను సందర్శిం చేందుకు వీలుగా "భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్-పూరీ, కాశీ, అయోధ్య పుణ్యక్షేత్ర యాత్ర" పేరుతో ప్రత్యేక ట్రైన్ ను ప్రారం భించనున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. ఈ ట్రైన్ ఈ నెల 18న సికింద్రాబాద్ నుంచి ప్రారం _భమవుతుందని తెలిపారు. బుధవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భరత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ శనివారం సికింద్రాబాద్లో స్టార్ట్ అయి. ఖాజీపేట, ఖమ్మం, విజయ వాడ, రాజమండ్రి, వైజాగ్. విజయనగరం | మీదుగా పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి ప్రాంతా లను 9 రోజుల్లో కవర్ చేసి తిరిగి సికింద్రా బాద్ చేరుకుంటుందన్నారు. ఫుడ్, షెల్టర్, వైద్య సేవలు, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాల తో ఐఆర్సీటీసీ ఈ ప్యాకేజీని అందచేస్తోం దని చెప్పారు. ఈ ట్రైన్లో స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బెర్తులు 700 ఉండగా, అన్నీ బుక్ అయ్యాయన్నారు..