
గోదావరిఖని, వెలుగుసైకిల్ ఇండికేటర్లు, రోబో గణేశ్ , మాట్లాడే వినాయకుడు, రిమోట్ తో ఎగిరే జాతీయ జెండా, మొబైల్ టు మొబైల్ చార్జిం గ్ .. ఇలాం టి వినూత్న ప్రయోగాలతో అబ్బుర పరుస్తు న్నాడు గోదావరిఖనిలోని తిలక్‌నగర్‌కు చెం దిన బోశెట్టి భరత్ ప్రశాం త్. ఇవన్నీ వృథాగా మిగిలిన వస్తువులతో తయారుచేయడం అతని స్పె షాలిటీ. భరత్ ఎలక్ర్టానిక్స్‌లో పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. అతని తండ్రి నాగేశ్వరరావుకు సైకిల్ షాప్ ఉంది. తన ప్రయోగాలకు అవసరమైన డబ్బుల కోసం ఒక కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. పాఠశాల విద్యార్ థులకు ప్రయోగాలు చేయడంపై మూడు నెలల పాటు శిక్షణ ఇస్తున్నాడు. వాళ్లతో టాకింగ్ రోబో, సింగిం గ్ రోబో, ఏటీఎం మెషీన్ .. లాం టివి తయారుచేయిం చి బహుమతులు అందుకునేలా చేశాడు. తక్కువ ఖర్చుతో.. పండుగలకు వినూత్నం గా రిమోట్ కంట్రోల్ పరికరాలు తయారు చేయడం హాబీగా మార్చుకు న్నాడు భరత్. వినాయక చవితికి రోబో గణేశ్ , రిమోట్ కంట్రోల్ తో మాట్లాడే వినాయకుడి ని తయారు చేశాడు. అంతేకాదు మొబైల్ ఫ్లాష్ లైట్, ముత్యా ల బతుకమ్మ, జాతీయ జెండా, మినీ కూలర్, చిన్నారుల కోసం వైబ్రేషన్ బ్రష్, వైట్ హౌస్ , తాజ్ మహల్ , క్రిస్మస్ ట్రీ.. లాం టి వాటిని వృథా సామగ్రితో రూపొందిం చాడు.
రూ.200 ఖర్చు తో జాతీయ గీతం వినపడేలా ఒక వస్తువుని తయారుచేశాడు. ఇది పూర్తిగా సెన్సర్ ద్వారా పనిచేయడం విశేషం. హ్యాండ్ గ్లౌస్ లో సిమెం ట్ నింపి ..దాన్ని జాతీయ జెండాలా మార్చేశాడు.
పాడైన బల్బులో జాతీయ జెండా అమర్చి బ్యా టరీతో లైట్లు వెలిగిలా ప్రయోగం చేశాడు. ‘ఇప్పటి వరకు యాభైకి పైగా ప్రయోగాలు చేసిన. నాకు భవిష్యత్తులో సైం టిస్టు కావాలని ఉంద’ని భరత్ చెబుతున్నాడు.