
దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ జెన్ అనే కృత్రిమ మేధ ఆధారిత లార్జ్ లాంగ్వేజ్ నమూనా(ఎల్ఎల్ఎం)ను కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్రసింగ్ ప్రారంభించారు. ఈ లార్జ్ లాంగ్వేజ్ నమైనా(ఎల్ఎల్ఎం) భారతీయ భాషలను అనువదించడంతోపాటు ఆయా భాషల్లో లిఖిత, వాచ్య సంభాషణలు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది.
ఈ ఎల్ఎల్ఎంను నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అనే కార్యక్రమం కింద రూపొందించారు. ఈ ఎల్ఎల్ఎం నమూనా 22 భారతీయ భాషల్లో కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు చూపుతుందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అన్నారు.