మలయాళంలో సంచలనం సృష్టించిన బ్లాక్ బస్టర్ మూవీ 'భరతనాట్యం 2: మోహినియాట్టం'. ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్, థియేటర్లలో సుమారు రూ.40 కోట్ల కలెక్షన్లతో సత్తా చాటింది. ఇందులో సైజు కురుప్, సూరజ్ వెంజరమూడు, జగదీష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సూపర్ హిట్ మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 8 నుంచి స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండటంతో ఆడియన్స్ ఖుషి అవుతున్నారు. 2024లో వచ్చిన భరతనాట్యం మూవీకి సీక్వెల్.
Once you get in, there is no way out 😉 pic.twitter.com/t29BxLduo5
— Netflix India South (@Netflix_INSouth) May 8, 2026
కథేంటంటే:
2024లో వచ్చిన ‘భరతనాట్యం’ సినిమాకు సీక్వెల్‌గా ‘భరతనాట్యం –2 మోహినియాట్టం’ వచ్చింది. భరతన్ నాయర్ చనిపోయే ముందు తనకు మరో కుటుంబం ఉందనే రహస్యాన్ని బయటపెడతాడు. దాంతో అతని భార్య, పెద్ద కొడుకు శశిధరన్ (సైజు కురుప్)తో సహా పిల్లలంతా - ఆ కుటుంబాన్ని కలిసేందుకు శ్రీకందపురానికి వెళ్తారు. కానీ, అక్కడికి వెళ్లాక భరతన్ తమ దగ్గర ఇంకా చాలా విషయాలు దాచి ఉంచాడని తెలుసుకుంటారు. అదే ఊరికి చెందిన గోవిందన్ (సూరజ్ వెంజరమూడు) వచ్చి వాళ్ల నాన్నకు సంబంధించిన ఒక రహస్యాన్ని చెప్తాడు. ఆ రహస్యం ఏంటి? దానివల్ల వాళ్లు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నారు? తెలియాలంటే సినిమా చూడాలి.
A ‘kola’mass family is on their way 🫨 pic.twitter.com/0p4qJkQs3e
— Netflix India South (@Netflix_INSouth) May 5, 2026
ఎలా ఉందంటే:
‘భరతనాట్యం –2 మోహినియాట్టం’ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్, మొదటి భాగంలో ఉన్న డార్క్ కామెడీ టోన్‌ను కొనసాగిస్తూ మరింత మిస్టరీ, ఫ్యామిలీ సీక్రెట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ముందుకు సాగుతుంది. కథ మొదటి నుంచే ఆసక్తికరంగా మొదలై, ఒక్కో సన్నివేశంలో కొత్త రహస్యాలను బయటపెడుతూ ప్రేక్షకుడిని కథలోకి లాగేస్తుంది.
భరతన్ నాయర్ మరణానికి ముందు చెప్పిన “మరో కుటుంబం” విషయం కథకు ప్రధాన బలం. కుటుంబ సభ్యులు శ్రీకందపురానికి వెళ్లిన తర్వాత ఎదురయ్యే సంఘటనలు కథను మలుపులు తిప్పుతాయి. సింపుల్ ఫ్యామిలీ డ్రామాగా మొదలై, తర్వాత డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా మారే తీరు బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ట్విస్టులు ఆసక్తిని పెంచుతాయి.
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి. గ్రామీణ నేపథ్యాన్ని నేచురల్‌గా చూపించారు. ఎడిటింగ్ కొన్నిచోట్ల కాస్త స్లోగా అనిపించినా, క్లైమాక్స్ వరకు ఆసక్తి నిలబెట్టడంలో టీమ్ సక్సెస్ అయ్యింది.
డార్క్ కామెడీ, ఫ్యామిలీ మిస్టరీ, థ్రిల్లర్ జానర్‌లను ఇష్టపడేవారికి ‘భరతనాట్యం –2 మోహినియాట్టం’ మంచి వాచ్. మొదటి భాగం చూసినవారికి ఈ సీక్వెల్ మరింత కనెక్ట్ అవుతుంది. ఓటీటీ వాచ్‌గా మంచి ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు.
