బీఆర్కే భవన్ నుంచి ప్రారంభమైన ప్రభుత్వ పాలన 

బీఆర్కే భవన్ నుంచి ప్రారంభమైన ప్రభుత్వ పాలన 

భీఆర్కే భవన్  నుంచి  పూర్తిస్థాయిలో  ప్రభుత్వ పాలన  ప్రారంభమైంది. శాఖల తరలింపు  దాదాపు  పూర్తికావడంతో  సెక్రటేరియట్ కు  తాళం వేశారు. గేట్ ముందు   ముళ్ల కంచె  వేశారు పోలీసులు. లోపలికి  వెళ్లేందుకు ఎవరికీ అనుమతి  ఇవ్వడం లేదు. పెండింగ్  పనులు  ఏమైనా ఉంటే  ఉన్నతాధికారుల  పర్మిషన్ తో  మాత్రమే  లోపలికి పంపిస్తున్నారు.

పాత సెక్రటేరియేట్  కూల్చి  400 కోట్లతో  కొత్తది  నిర్మించేందుకు  సీఎం ఇప్పటికే  భూమి పూజ  కూడా చేశారు. దీంతో..  దాదాపు  రెండు నెలల నుంచి  శాఖల తరలింపు  కొనసాగుతోంది. ఇప్పటివరకు  95శాతానికి పైగా శాఖలను  తరలించినట్లుగా  GAD అధికారులు  తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచే AP  మెయిన్ గేట్ ను  అధికారులు మూసేశారు.

మొత్తం  షిప్టింగ్ పూర్తైన  తర్వాత   రోడ్లు భవనాల శాఖ  అధికారులతో ముఖ్యమంత్రి  సమావేశం అవుతారు.  సెక్రటేరియట్ లోని  10 భవనాలతో పాటు…. జి బ్లాక్  కూల్చివేతపై  చర్చిస్తారు. కూల్చివేత  టైంలో  తీసుకోవాల్సిన జాగ్రత్తలు,  కూల్చివేతకు  మన దేశంలో  ఎలాంటి  టెక్నాలజీ వాడాలి  అనే అంశంపై  చర్చించి  నిర్ణయం తీసుకుంటారు. సెక్రటేరియట్  భవనాలతో పాటు నల్ల పోచమ్మ  ఆలయం, మసీద్ లు  ఉన్నాయి. వీటిపైన  కూడా అధికారులు,  సీఎంతో  చర్చించనున్నారు.