రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. సోమవారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో సాంగ్ కంపోజ్ చేయగా, ‘బెల్లా బెల్లా ఇసా బెల్లా.. బాగున్నావే రసగుల్ల.. ఎల్లా ఎల్లా స్పైసీ ఇల్లా.. నింపేసావే నిలువెల్లా..’ అంటూ సురేష్ గంగుల క్యాచీ లిరిక్స్ అందించాడు.
నకాష్ అజీజ్, రోహిణి సోర్రాట్ ఎనర్జిటిక్‌గా పాడారు. ‘స్పెయిన్ కే అందాలనిట్ట అద్దిన ఓ పూల బుట్టా... వీధుల్లో పోతుంటే ఎట్టా, వార్తల్లో రాయాలి చిట్టా.. నీ బుగ్గల్లో బాగుందే సొట్ట, దానిపై ముగ్గులు పెట్టా..బ్యూటీల పోటీలో పట్టా.. పొందినావ ఫారిన్‌లో ఎట్టా’ అంటూ సాగిన పాటలో రవితేజ, ఆషికా రంగనాథ్ స్టైలిష్ లుక్స్‌లో ఆకట్టుకున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో వీరు డ్యాన్స్ చేసిన మూమెంట్స్, ఫారిన్‌లో సాంగ్ చిత్రీకరించడం హైలైట్‌గా నిలిచింది.
