భార్యకు భయపడేవాడే భర్త..భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ రిలీజ్

భార్యకు  భయపడేవాడే భర్త..భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ రిలీజ్

రవితేజ హీరోగా కిషోర్ తిరుమల రూపొందిస్తున్న చిత్రం  ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.  ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ఇందులో రామ్ పాత్రలో  రవితేజ  హ్యాపీ మ్యారీడ్  మ్యాన్‌‌‌‌గా కనిపిస్తాడు.  అయితే బిజినెస్ పనిమీద స్పెయిన్‌‌‌‌కు  వెళ్లి ఆషికా రంగనాథ్‌‌‌‌తో ఎఫైర్ పెట్టుకుం టాడు.  ఓవైపు భార్య, మరోవైపు ప్రియురాలు ఎమోషన్స్ మధ్య నలిగిపోతూ, గైడెన్స్ కోసం ఒక సైకాలజిస్ట్ (మురళీధర్ గౌడ్‌‌‌‌)ని కలుస్తాడు.

 అక్కడ తన కథను వివరిస్తూ సాగిన టీజర్ హిలేరియస్‌‌‌‌గా ఉంది.  మగాళ్లు ఎలా ఉండాలి అనేదానికి రోల్ మోడల్ అని ఆయన భార్య డింపుల్ హయతి   చెప్పడం ఫన్నీగా అనిపిస్తుంది. హీరోయిన్స్ డింపుల్, ఆషికా స్టైలిష్‌‌‌‌గా కనిపిస్తూ ఇంప్రెస్ చేయగా,  వెన్నెల కిశోర్, సునీల్ తమదైన కామెడీ టైమింగ్‌‌‌‌తో అలరించారు.  ‘ఎవడైతే తప్పు చేసి.. ఆ తప్పు తన భార్యకు తెలిస్తే ఎక్కడ బాధపడుతుందోనని భయపడతాడో వాడే  అసలు సిసలైన నిఖార్సైన భర్త..’ అని మురళీధర్ గౌడ్ చెప్పిన డైలాగ్ సినిమాపై  క్యూరియాసిటీని పెంచింది. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది.  చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం  సంక్రాంతి సందర్భంగా జనవరి 13న  విడుదల కానుంది.