అమ్మాయిలంతా రిలేట్ అయ్యేలా.. భర్త మహాశయులకు విజ్ఞప్తి

అమ్మాయిలంతా రిలేట్ అయ్యేలా.. భర్త మహాశయులకు విజ్ఞప్తి

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుందని హీరోయిన్స్ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ చెప్పాడు.  రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం  జనవరి 13న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా  డింపుల్ హయతి మాట్లాడుతూ ‘ఈ కథ వినగానే బాగా నచ్చింది. ఇందులో రవితేజ భార్యగా బాలామణి పాత్రలో కనిపిస్తా. - నాది వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ క్యారెక్టర్.  డైరెక్టర్ కిషోర్ నా క్యారెక్టర్‌‌‌‌ను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ పాత్ర ఒక కొత్త ఎక్స్‌‌పీరియెన్స్‌‌ ఇచ్చింది.  అమ్మాయిలందరూ రిలేట్ అవుతారు.  మా ఇద్దరి పెర్ఫార్మెన్స్ ఎనర్జిటిక్‌‌గా ఉంటుంది. అలాగే  ఒక సర్‌‌‌‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. కామెడీ కూడా చాలా సెన్సిబుల్‌‌గా ఉంటుంది.  రవితేజ గారితో ఇది నా రెండో సినిమా. ఆయనతో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది’ అని చెప్పింది. ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నేను మోడ్రన్ గర్ల్ పాత్ర పోషించా.

 ‘నా సామిరంగ’తో పోల్చుకుంటే ఇది కంప్లీట్‌‌గా డిఫరెంట్ క్యారెక్టర్. కచ్చితంగా నా కెరీర్‌‌‌‌లో చాలా కొత్తగా ఉంటుంది.  -ఇందులో నా పాత్ర పేరు మానస శెట్టి.  ఇప్పుడున్న అమ్మాయిలు రిలేట్ అయ్యే క్యారెక్టర్.  రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఆయన ఫన్, ఎమోషన్‌‌ను అద్భుతంగా పండిస్తారు. రవితేజ గారితోపాటు, సునీల్, వెన్నెల కిషోర్, సత్య అందరూ కూడా అద్భుతమైన కామెడీ టైమింగ్ వున్న నటులు. వాళ్ళ టైమింగ్‌‌ని మ్యాచ్ చేయడం ఛాలెంజ్‌‌గా అనిపించింది’ అని చెప్పింది.