
న్యూఢిల్లీ : ఇటీవల ముగిసిన 5జీలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు బకాయిల కోసం టెలికాం శాఖకు భారతీ ఎయిర్‌టెల్ రూ.8,312.4 కోట్లు చెల్లించింది. నాలుగు సంవత్సరాల స్పెక్ట్రమ్ బకాయిలను ముందుగానే కట్టేశామని ప్రకటించింది. దీనివల్ల తాము 5జీపై మరింత ఫోకస్ చేయవచ్చని తెలిపింది. ఎయిర్‌టెల్ 5జీ స్పెక్ట్రమ్ కోసం వేసిన రూ.43,039.63 కోట్ల విలువైన విజయవంతమైంది. ఇదే నెలలో 5జీ అందిస్తామని ప్రకటించింది. రైట్స్ ఇష్యూ నుండి వచ్చిన రూ. 15,740.5 కోట్ల క్యాపిటల్ కూడా తమ దగ్గర ఉందని ఎయిర్‌టెల్ ఎండీ, సీఈఓ గోపాల్ విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు.
రూల్స్ ప్రకారం రూ. 3,848.88 కోట్లను ముందుగా, మిగిలిన మొత్తాన్ని 19 వార్షిక వాయిదాలలో చెల్లించే అవకాశం కంపెనీకి ఉంది. దేశంలోనే అతిపెద్ద టెలికాం స్పెక్ట్రమ్ వేలం రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి రూ. 1.5 లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ముకేశ్ అంబానీకి చెందిన జియో రూ. 87,946.93 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకుంది.