ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు: భారతి హోళీకేరి

ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు: భారతి హోళీకేరి

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు :  ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేశామని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళీకేరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేశామన్నారు. 

ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందన్నారు. జిల్లావాసులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.