పంజాబ్​లో భట్టి..ఢిల్లీలో బల్మూరి  ప్రచారం

పంజాబ్​లో భట్టి..ఢిల్లీలో బల్మూరి  ప్రచారం

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల ఆరో విడతలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం పంజాబ్‌ వెళ్లారు. ఆ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్​సభ నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకుడిగా భట్టిని కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. దీంతో ఆయన బుధవారం నుంచి మూడు రోజుల పాటు అక్కడ  ప్రచారం చేస్తున్నారు. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఢిల్లీ నార్త్ ఈస్ట్ లోక్​సభ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎన్ఎస్‌యూఐ నేషనల్ ఇన్​చార్జ్​ కన్హయ్య కుమార్  పోటీ చేస్తున్నారు.