ఓట్లు తొలగించి పవర్‌‌‌‌‌‌‌‌లోకి వస్తున్నరు..సర్‌‌‌‌‌‌‌‌ ముసుగులో బీజేపీయేతర ఓట్లను తీసేస్తున్నరు: భట్టి విక్రమార్క 

ఓట్లు తొలగించి పవర్‌‌‌‌‌‌‌‌లోకి వస్తున్నరు..సర్‌‌‌‌‌‌‌‌ ముసుగులో బీజేపీయేతర ఓట్లను తీసేస్తున్నరు: భట్టి విక్రమార్క 
  • పలు రాష్ట్రాల్లో సక్సెస్ కావడంతో తెలంగాణలోనూ అమలు చేస్తున్నరు 
  • ఒక్కో నియోజకవర్గంలో 60 వేల నుంచి 70 వేల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర
  • ఓట్‌‌‌‌ చోరీతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేశారు: ఎంపీ వంశీకృష్ణ
  • మంచిర్యాలలో బీఎల్‌ఏ అవగాహన సదస్సుకు హాజరు

మంచిర్యాల/గోదావరిఖని, వెలుగు:  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్ ​పేరిట బీజేపీయేతర పార్టీల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఓట్లను తొలగించడం ద్వారా అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఇప్పుడు తెలంగాణలోనూ దానిని అమలు చేస్తోందన్నారు. ఆదివారం మంచిర్యాలలో సర్‌‌‌‌‌‌‌‌పై బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌‌‌‌ఏ)కు అవగాహన సదస్సు నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌‌‌‌సాగర్​రావు, డీసీసీ చైర్మన్ పిన్నింటి రఘునాథ్​రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్‌‌‌‌షిప్ అమెండ్‌‌‌‌మెంట్ యాక్ట్ (సీఏఏ)కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేయడంతో సర్ పేరిట కొత్త కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. సోషల్​మీడియాలో బీజేపీయేతర పార్టీలు, లీడర్ల ఫాలోవర్లను గుర్తించి వారి ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. ఒక్కో నియోజకవర్గంలో 60 వేల నుంచి 70 వేల ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. చిన్నచిన్న లోపాల సాకుతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని, ఓటు లేకుంటే భవిష్యత్తులో పౌరసత్వానికే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. 

మన ఓట్లు మనమే కాపాడుకోవాలి: ఎంపీ వంశీకృష్ణ 

దేశవ్యాప్తంగా బీజేపీ దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలుస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. ఓట్ చోరీ ద్వారా ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చేశారన్నారు. 
‘‘మొన్న వెస్ట్ బెంగాల్‌‌‌‌లో మమతా బెనర్జీ కేవలం 5 వేల ఓట్లతో ఓడిపోయారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ కూడా కొన్ని వేల ఓట్లతోనే ఓటమిపాలయ్యారు. తమిళనాడులో సీఎం స్టాలిన్ సైతం అదే పరిస్థితి’’అని గుర్తుచేశారు. ఎలక్షన్లలో ఎవరు గెలవాలో, ఎవరు ఓడిపోవాలో బీజేపీ లీడర్లు డిసైడ్ చేస్తున్నారని, ఈ పరిణామం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ దొంగ ఓట్లతోనే గెలిచి ప్రధాని కుర్చీలో కూర్చున్నారని ఆరోపించారు.

బెంగాల్ ఎలక్షన్స్ పూర్తయ్యిన నెల రోజుల్లోనే 4 వేల ఈవీఎంలు కాల్చేసి ఓట్ చోరీ ఎవిడెన్స్ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మన ఓట్లు మనమే కాపాడుకోవాలని, బీఎల్‌‌‌‌ఏలు అంబేద్కర్ స్ఫూర్తితో ఓట్ చోరీ కాకుండా చూడాలని ఆయన సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్​వెంకటస్వామి ఏటీసీలు, టామ్‌‌‌‌కామ్ ద్వారా యువతకు జర్మనీతో పాటు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. గత రెండేండ్లలో పెద్దపల్లి నియోజకవర్గానికి తాను రూ.7 వేల కోట్లు తీసుకొచ్చానని, పదేండ్లలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​, బీజేపీ లీడర్లు ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ప్రజలను చేతన్యం చేయాలి..

అంతకుముందు గోదావరిఖనిలో బీఎల్‌‌‌‌ఏల మీటింగ్‌‌‌‌లో వంశీకృష్ణ మాట్లాడుతూ.. సర్ పేరుతో తెలంగాణలో ఓట్‌‌‌‌ చోరీ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఓట్లను కాపాడుకునే బాధ్యత బీఎల్‌‌‌‌ఏలపై ఉందన్నారు. గడప గడపకు తిరిగి బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. సింగరేణిని బీఎఫ్ఐఆర్ నుంచి నాటి కేంద్ర మంత్రి కాకా వెంకస్వామి కాపాడారని, అదే తరహాలో తాము కూడా సింగరేణి కార్మికులకు అండగా ఉంటామన్నారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులకు రూ.పది వేల పెన్షన్ వచ్చే వరకు పోరాడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, విప్ విజయరమరణారావు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, మేయర్ మహాంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు.