మెడికల్ ఇన్వాలి డేషన్‌‌పై విచారణ చేయిస్తున్నం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మెడికల్ ఇన్వాలి డేషన్‌‌పై విచారణ చేయిస్తున్నం :  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •  కౌన్సిల్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో సింగరేణిలో జరిగిన మెడికల్ ఇన్వాలిడేషన్‌‌(వైద్య కారణాల వల్ల ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించడం)పై విచారణ జరిపిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. మంగళవారం కౌన్సిల్‌‌లో బీఆర్​ఎస్​ సభ్యుడు మధుసూదనాచారి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2014 నుంచి 2023 వరకు ఐదేండ్ల కాలంలో సింగరేణిలో మొత్తం 13,119 మంది మెడికల్ ఇన్వాలిడేషన్‌‌కు గురయ్యారని తెలిపారు. అవసరం లేకపోయినా పెద్ద సంఖ్యలో ఇన్వాలిడేషన్ జరిగిందని, దీంతో సంస్థపై ఆర్థిక భారం పడుతున్నదన్నారు. 

ఈ వ్యవహారంపై ఏసీబీ, విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నదని  చెప్పారు. 2000 నుంచి 2014 వరకు 14 ఏండ్లలో 3,859 ఇన్వాలిడేషన్లు మాత్రమే జరిగాయని, దీంతో బీఆర్ఎస్​ హయాంలో దుర్వినియోగం జరిగినట్టు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ సంస్థల నిబంధనలు పరిశీలించి మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియను కట్టుదిట్టం చేసేందుకు   ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.