
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్
- డెడ్ స్టోరేజీ వద్ద ప్రాజెక్టును చేపట్టింది మీరు కాదా?
- నిర్మాణంలో క్వాలిటీ పాటిస్తే ఎందుకు కూలేది?
- రీడిజైన్ల పేరుతో ప్రభుత్వ ఖజానాను దోచుకున్నరు
- బీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టే మేం సుంకిశాలను ఎందుకు దాస్తం?
- కృష్ణాపై గత సర్కార్ కట్టిన ప్రాజెక్టులన్నింటిపై ఎంక్వైరీ చేయిస్తామని ప్రకటన
- పంద్రాగస్టున వైరా వేదికగా రూ. 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని వెల్లడి
ఖమ్మం/ వైరా, వెలుగు: సుంకిశాల ప్రాజెక్టును క్వాలిటీ లేకుండా ఇష్టమున్నట్లు గత బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిందని, దాని ఫలితంగానే ప్రాజెక్టు రిటైలింగ్ వాల్ కూలిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన పొరపాటును కేటీఆర్ ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేసినందుకు క్షమాపణ చెప్పడం మానేసీ తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల్లో నీళ్లు రాకుండానే కాళేశ్వరంలోని మేడిగడ్డ కుంగిపోయింది.. నీళ్లు వచ్చిన తర్వాత సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది. దీనికి గత సర్కార్ అవినీతే కారణం.
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ వద్ద నిర్మించే ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే మరేం వస్తాయో కేటీఆర్ చెప్పాలి. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కట్టింది మీ(బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో కాదా? నాణ్యతగా నిర్మాణం జరిగితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది?” అని నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణా నదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టుల నాణ్యతపై విచారణ చేయించాలని భావిస్తున్నామన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా వైరా మండలం స్థానాల లక్ష్మీపురంలో వివిధ అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
15న వైరాలో రుణమాఫీ సభ.. హాజరుకానున్న సీఎం
ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీని వైరా వేదికగా అమలు చేస్తామని, ఈ సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆగస్టు 15 నాటికి రైతులకు రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేస్తామన్న మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రెండు విడతల్లో 16 లక్షల 29 వేల కుటుంబాలకు లక్షన్నర రూపాయల వరకు ఉన్న పంట రుణమాఫీ చేశామని, రైతుల ఖాతాల్లో రూ.12,298 కోట్లు జమ చేశామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని ప్రకటించారని.. డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా తాను పైసా పైసా పోగుచేసి రైతులకు రుణమాఫీ చేస్తున్నామని వివరించారు. ‘‘లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్.. పదేండ్లు అధికారంలో ఉండి రైతులను మోసం చేసింది. అలాంటిది ఆ పార్టీ లీడర్లు రైతుల పక్షపాతి బీఆర్ఎస్ అంటూ ముసలి కన్నీరు కారుస్తున్నరు” అని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమప్రభుత్వం తొలిసారిగా వ్యవసాయ శాఖకు రూ.72 వేల కోట్లు కేటాయించిందని చెప్పారు.
ఎవరు చెప్పినా కేసీఆర్ వినలే
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను అక్కడ కట్ట డం సరికాదని అప్పట్లో కాంగ్రెస్ చెప్పినా కేసీఆర్ విని పించుకోలేదని, సొంత నిర్ణయాలతో కట్టడం వల్లే మేడి గడ్డ కుంగిందని భట్టి అన్నారు. ‘‘ఇంజనీర్లు చేయాల్సిన పనిని కేసీఆర్ చేయడం వల్లే మేడిగడ్డ పనికిరాకుండా పోయిందని డ్యామ్ సేఫ్టీ అధికారులు ధ్రువీకరించారు” అని తెలిపారు. గత సర్కార్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల నాణ్యత లోపాలు, అవినీతిని బయట పెట్టాల ని చూసే తమ ప్రభుత్వం సుంకిశాల ఘటనను ఎందుకు దాచిపెడుతుందని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ఇరిగే షన్ ప్రాజెక్టులకు రీడిజైన్ పేరుచెప్పి ప్రభుత్వ ఖజానాను గత సర్కార్ దోచుకుందని, ఇరిగే షన్ను భ్రష్టు పట్టిం చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా లో కేవలం రూ. 1450 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇంది రా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు గా పేరు మార్చి రూ. 23 వేల కోట్ల కు అంచనాలు పెంచా రని, ఈ ప్రాజెక్టుపై 8 వేలకోట్లు ఖర్చు పెట్టి ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. ఈ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు వృథా కాకుండా ఉండేందుకు ఇంజనీర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించి రాజీవ్ గాంధీ లింక్ కెనాల్‌ను ప్రతిపాదించారని తెలిపారు. కేవలం రూ.75 కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధమైంద ని, కేవలం 3 నెలల్లోనే కాలువను పూర్తి చేసి రైతులకు నీళ్లివ్వడం తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు.