అప్పులు కట్టడానికా పోరాడి తెలంగాణ సాధించుకుంది?

అప్పులు కట్టడానికా పోరాడి తెలంగాణ సాధించుకుంది?

పెద్దపల్లి జిల్లా: బడ్జెట్ గూరించి అసెంబ్లీలో నిజాలు మాట్లాడుదామంటే  మైక్ లు కట్ చేసి తమ గొంతు నొక్కారని సి.యల్.పి.నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రాష్ట్ర బడ్జెట్ పై నిజ నిజాలు ప్రజలకు తెలియాలని భట్టి విక్రమార్క  పెద్దపల్లి యన్. యస్.గార్డెన్స్ లో  పవర్ పాయింట్  ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. సి.యం.కేసీఆర్ గొప్పగా చెబుతున్న రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి బడ్జెట్  అని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టడం వల్ల 2024 వరకు రాష్ట్ర అప్పులు 5లక్షల కోట్లకు చేరనున్నాయన్నారు. ఈ అప్పుల వల్ల సామాన్యుడు,రోజు వారీ కూలి కూడా తన నిత్యావసరలకు భారీ పన్నులు కట్టే పరిస్థితి వస్తుందని చెప్పారు.

“అప్పు తప్పు కాదు గొప్ప అని చెబుతున్న సీఎం కేసీఆర్ ఈ రాష్ట్ర అప్పులను ఎలా తీరుస్తారో చెప్పాలి.రాష్ట్రానికి రాబడి తక్కువ, అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఇసుక పాలసి ద్వారా ఇన్ని కోట్లు ఆదాయం తీసుకువచ్చామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తీర్చడానికి గాలికి, నీటికి పన్నులు వసూలు చేసి ఇంకా గొప్పగా చెప్పుకుంటుందేమో..” అని అన్నారు భట్టీ

“టి.ఆర్.యస్.ప్రభుత్వం,  సీఎం కేసీఆర్ గొప్పలకు పోయి రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్న పథకాలు అమలు చేస్తేనే ఇన్ని లక్షల కోట్ల అప్పులు. కొత్త పథకాలు అమలు చేస్తే జీతాలు కూడా ఇయ్యని పరిస్థితి. సంక్షేమం ఆటకెక్కుతుంది. అప్పులు కట్టడానికేనా మనం నా పోరాడి తెలంగాణ సాధించింది.” అని భట్టి ప్రజలతో అన్నారు.

కేంద్రం నుండి వచ్చే నిధులను ఎక్కువగా చూపిస్తూ కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. పోలవరం రీ టెండరింగ్ ద్వారా ప్రక్క రాష్ట్ర  ప్రభుత్వానికి కొన్ని కోట్లు ఆదా అయ్యాయన్నారు భట్టీ. ఆలాగే ఈ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కు,మిషన్ భగీరథకు జ్యూడిషల్ కమిటీ,గ్లోబలైజేషన్ టెండర్ పిలుపునిస్తే మనకు కూడా 13 నుండి15 శాతానికి తక్కువ కోట్ చేసే అవకాశం ఉందని , దాని ద్వారా సుమారు 34వేల కోట్లు రాష్ట్రానికి ఆదా అవుతాయని అన్నారు.

Bhatti Vikramarka gives Power Point Presentation on State Budget at Peddapalli