భట్టి సవాలును స్వీకరించిన తలసాని

భట్టి సవాలును స్వీకరించిన తలసాని

హైదరాబాద్:  డబుల్ ఇళ్లపై బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి  తలసాని శ్రీనివాస్ కు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మధ్యన మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. తలసాని ఆహ్వానం మేరకు గురువారం భట్టి పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లను  మంత్రి తలసాని శ్రీనివాస్ చూపించగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరిశీలించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్లు కొత్త వాళ్లకు ఇచ్చింది తక్కువేన్నారు.

లక్ష ఇళ్లు అంటున్నారు.. ఎక్కడ కట్టారో చూడాలన్నారు. గురువారం 3,428 ఇళ్లను పరిశీలించామన్నారు. కొత్తగా 400 మందికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారని ఆయన తెలిపారు. శుక్రవారం కూడా ఇళ్లను పరిశీలించాలనుకుంటున్నామని చెప్పారు. ఇళ్ల నాణ్యతను క్వాలిటీ విభాగం పరిశీలిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు.హైదరాబాద్‌ లో డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్లపై బుధవారం అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే. లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లను చూపాలని అసెంబ్లీలో భట్టి సవాల్‌ చేశారు. ఆ సవాల్‌ను మంత్రి తలసాని స్వీకరించారు.

గురువారం డబుల్ ఇళ్లను పర్యటించిన ప్రాంతాలు
1)జియా గూడ
2)గోడేకి ఖబర్
3)నాంపల్లి
4)ఐ మాక్స్ ఎదురుగా.. ఖైరతాబాద్
5)బోయిగూడ
6)వెస్ట్ మారేడ్ పల్లి