సిట్రస్‌‌‌‌‌‌‌‌ జాతి పండ్ల కోసం స్పెషల్ జ్యూసర్

సిట్రస్‌‌‌‌‌‌‌‌ జాతి పండ్ల కోసం స్పెషల్ జ్యూసర్

నారింజ, బత్తాయి, నిమ్మ లాంటి పండ్ల జ్యూస్‌‌‌‌‌‌‌‌ని మిక్సీలో వేసి తీయలేం. అలా తీస్తే పల్ప్‌‌‌‌‌‌‌‌ అంతా జ్యూస్‌‌‌‌‌‌‌‌లోనే కలుస్తుంది. అందుకే వాటికోసం ఇలాంటి జ్యూసర్లను వాడాలి. దీన్ని కె సలియా అనే కంపెనీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చింది. దీన్ని ప్రత్యేకంగా సిట్రస్‌‌‌‌‌‌‌‌ జాతి పండ్ల కోసమే డిజైన్‌‌‌‌‌‌‌‌ చేశారు. పండుని అడ్డంగా కోసి, మెషిన్‌‌‌‌‌‌‌‌లో పెట్టి స్విచ్‌‌‌‌‌‌‌‌ ఆన్ చేస్తే చాలు. 

కింది భాగంలో ఉన్న స్టోరేజీ కంటైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జ్యూస్‌‌‌‌‌‌‌‌ పడిపోతుంది. ఇది ఇన్‌‌‌‌‌‌‌‌బిల్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాటరీతో వస్తుంది. టైప్‌‌‌‌‌‌‌‌సీ కేబుల్‌‌‌‌‌‌‌‌తో చార్జ్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. మన్నికైన ఫుడ్ గ్రేడ్ మెటీరియల్​తో తయారుచేశారు. 

ధర: 599