17 రోజుల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉంచాలి: భట్టి

17 రోజుల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉంచాలి: భట్టి

జల విద్యుత్ ప్రాజెక్టుల్లో గరిష్ట ఉత్పత్తికి అన్ని చర్యలు చేపట్టాలని చీఫ్ ఇంజనీర్లకు సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 17 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి వారానికి ఒకసారి నివేదిక పంపలన్నారు డిప్యూటీ సీఎం భట్టి. 

వర్షపాతాలను దృష్టిలో పెట్టుకొని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తికి అన్ని చర్యలు తీసుకోవాలని...CEలకు ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రజాభవన్ లో థర్మల్, హైడల్ విద్యుత్తు ఉత్పాదనకు సంబంధించిన...అంశాలపై  ఆ శాఖల CEలతో సమీక్ష సమావేశం నిర్వహించారు భట్టి.