ధర్నాలతో రైతులను బీజేపీ,టీఆర్ఎస్ మోసం చేస్తున్నయ్

ధర్నాలతో రైతులను బీజేపీ,టీఆర్ఎస్ మోసం చేస్తున్నయ్

రైతులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేస్తే ఉపయోగం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ సీఏల్పీ నేత భట్టి విక్రమార్క. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన ఆయన..సమస్యను పరిష్కరించాల్సిన ఆయుధం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరే ఉందన్నారు. వడ్లు కొనాల్సింది ఏ పాకిస్తానో.. బంగ్లాదేశ్ కాదు కదా అని ప్రశ్నించారు. రైతులను మోసం చేసేందుకే బీజేపీ, టీఆర్ఎస్ లు ధర్నాలు చేస్తున్నాయన్నారు.

మా వల్ల పాలన కాదు అని  చెప్పడానికి  బీజేపీ,టీఆర్ఎస్ లు ధర్నాలు చేస్తున్నాయా అని అన్నారు భట్టి. టీఆర్ఎస్ , బీజేపీ పాలనలో దేశం.. రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. ఈ రాష్ట్రంలో పరిపాలన స్థలమే లేదు..ఇంట్లోనే పరిపాలన జరుగుతోందన్నారు.  కేంద్రం పాలనను గాలికొదిలేసిందని.. ప్రభుత్వ సంస్థలను కేంద్ర ప్రభుత్వం తెగనమ్ముతోందన్నారు. అంతేకాదు..కార్పోరేట్ సంస్థలకు వ్యవసాయాన్ని అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు.