
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాపర్,గోల్డ్ మైనింగ్ లో సింగరేణి చేరిందన్నారు. ప్రపంచంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా సింగరేణి మారుతోందన్నారు. సింగరేణి మరింత విస్తరిస్తుందని చెప్పారు. ఇతర మినరల్స్ వేలంలో సింగరేణి పాల్గొంటుందన్నారు. రాగి, బంగారం, మైనింగ్ ను ఏ సంస్థ చేసినా సింగరేణికి రాయాల్టీ వస్తుందన్నారు భట్టి. కరెంట్ ఉత్పత్తిలో కూడా సింగరేణి కాలరీస్ ప్రవేశించిందన్నారు.
గ్రీన్ ఎనర్జీపైన సింగరేణి ఫోకస్ చేస్తుందన్నారు. సింగరేణిని బతికించుకోవాలంటే గనులు పెంచుకోవాలని చెప్పారు. సింగరేణి కాలరీస్ తెలంగాణ ఆత్మ అని అన్నారు భట్టి. సింగరేణి కాలరీస్ కి అదనపు బ్లాకులు రావట్లేదని చెప్పారు . తెలంగాణలో మరో 25 ఏళ్లకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పారు భట్టి. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకపోతే బొగ్గు గనులు ప్రవేట్ వ్యక్తులకు వెళ్తాయన్నారు. పలు రాష్ట్రాల్లోని ఎన్టీపీసీలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తందన్నారు భట్టి.