స్పీకర్ నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేల రిప్లై..వేటు తప్పినట్టేనా..?

స్పీకర్ నోటీసులకు  8 మంది ఎమ్మెల్యేల రిప్లై..వేటు తప్పినట్టేనా..?

హైదరాబాద్:  పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలు వేటు నుంచి తప్పి నట్టేనా అన్నది హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మె ల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని  ఆగస్టు 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. 

సుప్రీంకోర్టు సూచన మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. దానం నాగేందర్ (ఖైరతా బాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్ పూర్), అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహీపాల్ రెడ్డి (పటాన్ చెరు), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రన గర్), కాలేయాదయ్య (చేవెళ్ల), సంజయ్ కుమార్(జగిత్యాల), తెల్లం వెంకట్రావు(భద్రా చలం) కు  నోటీసులు జారీ చేశారు.

►ALSO READ | రూ.5 లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేసిన.. నా సక్సెస్‎లో సతీమణి సరోజా పాత్ర వెలకట్టలేనిది: మంత్రి వివేక్

వీళ్లలో దానం నాగేందర్, కడియ శ్రీహరి మినహా మిగతా వారంతా నోటీసులకు రిప్లయ్ ఇచ్చారు. వీళ్లిద్దరూ కొంచెం టైం కావాలని అన్నారు. రిప్లయ్ ఇచ్చిన 8 మంది కూడా తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకున్నారు. తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం మాత్రమే సీఎంను కలిశామని సమాధానం చెప్పారు. వీరిలో అరికపూడి గాంధీ బీఆర్ఎస్ తరపున పీఏసీ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్లపై వేటు తప్పినట్టేనా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ.. ఆ కేసును సుప్రీంకోర్టు ముగించింది. ఇందులో భాగంగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్నారు. ఈ క్రమంలో వాళ్ల వివరణపై స్పీకర్ సంతృప్తి చెందితే వేటు నుంచి బయటపడ్డట్టేననేని విశ్లేషకులు అంటున్నారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ... సి కింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయనకు టెక్నికల్ గా సమస్య తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. కడియం శ్రీహరి విషయానికి వస్తే ఆయన సీఎంతో చర్చించిన తర్వాత నోటీసులకు రిప్లయ్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.