
హైదరాబాద్: తన అభివృద్ధిలో సతీమణి సరోజా పాత్ర వెలకట్టలేనిదని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రూ.5 లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేశానని.. దాన్ని అప్పుడు ఒక చాలెంజ్‌గా తీసుకున్నాని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళలకు ప్రభుత్వం మంచి ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం సీఐఐ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ఇన్నోవేటివ్ డెసిషన్మేకింగ్తో మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
హైటెక్ సిటీ టెక్ మహీంద్రాలో జరిగిన సీఐఐ ఇండియన్ విమెన్ నెట్వర్క్అప్ లిఫ్ట్, వాయిస్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో వివేక్మాట్లాడారు. ‘దేశ జీడీపీ పెరగాలంటే మహిళా వ్యాపారవేత్తలు కావాలి. వాళ్లకు ధైర్యం ఎక్కువ. మల్టీ టాస్కింగ్‌గా ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్న మహిళలకు అవకాశాలు ఇవ్వాలి. వారి సూచనలు చాలా విలువైనవి. ప్రోత్సాహం అందించాలి. ఇల్లు, వ్యాపారం చూసుకోవడం సులభం కాదు. నా కుటుంబంలో ఉన్న మహిళలు కూడా మంచి పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. ఫ్యామిలీని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. గ్రామీణ మహిళల్లో కూడా మంచి టాలెంట్ ఉంది. తప్పుడు నిర్ణయాలు జీవితానికి పాఠాలు నేర్పిస్తుంది’ అని అన్నారు.
►ALSO READ | గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు..అధికారులకు సీఎం ఆదేశం