
గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సెప్టెంబర్ 12న సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా గోదావరి తీరంలోని ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. బాసర,కాళేశ్వరం, ధర్మపురి,భద్రాచలంతో పాటు ఇతర ఆలయాలు సందర్శించి లిస్ట్ రెడీ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్లను విస్తరించాలని చెప్పారు రేవంత్. రోడ్లు, ఇతర సౌకర్యాలు శాశ్వత ప్రాతిపదికన కల్పించాలని సూచించారు. ప్రతి ఆలయానికి వేర్వేరు ఘాట్ల డిజైన్ ఉండాలని చేప్పారు. పర్యాటక,నీటిపారుదల దేవాదయ శాఖలు సమన్వయం చేసుకుని పనిచేయాలని చెప్పారు.
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు తరలి వచ్చే ఈ పుష్కరాలను ప్రభుత్వం ప్రతిస్జ్తాత్మకంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో స్థానిక నేతలు, సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ముందస్తు కార్యాచరణ కూడా సిద్దం చేశారు అధికారులు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నట్లు తెలుస్తోంది. పుష్కరాల నిర్వహణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం.
►ALSO READ | కాంగ్రెస్ కామారెడ్డి సభ వాయిదా..ఎందుకంటే.?
జూలై 23, 2027 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. 2015 లో పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు విషాదం మిగుల్చాయి. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి కోసం రూ.904 కోట్లతో ప్రతిపాదలు సిద్ధం చేశారు అధికారులు. అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేశారు. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా ఉండగా... మరిన్ని కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు అధికారులు.