దేశంలో శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీనే

దేశంలో శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీనే

దేశంలోని అన్ని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకురాగల ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. దేశంలో రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి... కానీ శాశ్వతంగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ పై కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి. దేశం కోసం ఇందిరమ్మ కుటుంబం చేసిన త్యాగాల ముందు ఏ పార్టీ నాయకులు కూడా సరిపోరన్నారు. ప్రధానమంత్రి పదవి తన ముందు నిలిచినా వద్దనుకున్న త్యాగమూర్తి సోనియా గాంధీ అని అన్నారు. దేశంలో రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, గాంధేయవాదమే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.