తెలంగాణ బడ్జెట్ 2024: ధరణి అందరికీ భారం.. కొందరికే ఆభరణం: భట్టి

తెలంగాణ బడ్జెట్ 2024: ధరణి అందరికీ భారం.. కొందరికే ఆభరణం: భట్టి

ధరణి పోర్టల్ కారణంగా ఎంతో మంది రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టీ విక్రమార్క.   రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని..  రైతును రాజు చేసేందుకు అనేక సంస్కరణలు చేపట్టనున్నట్లు చెప్పారు.ఫిబ్రవరి 10వ తేదీ శనివారం అసెంబ్లీలో  భట్టీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన బడ్జెట్ పై ప్రసంగించారు.  ధరణి పోర్టల్ కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని.. ధరణి కొంతమందికి ఆభరణంగా మారంది.. కొంతమందికి భారంగా మారందని చెప్పారు. ఎంతోమంది తమ సమస్యల, అవసరాల కోసం తమ స్వంత భూమిని అమ్ముకోలేకపోయారని తెలిపారు.

also read : ఇరిగేషన్ కు రూ.28 వేల కోట్లు : కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులపై విచారణ

పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు, ఇతర అవరసరాలను తీర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఇదంతా ధరణి పోర్టల్ కారణంగానే జరిగిందని... ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డులు అన్నింటినీ పరిశీంచగా.. ఇది నిజమేనని తేలిందని చెప్పారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకున్నామన్నారాయన. ధరణీ పోర్టల్ కారణంగా వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటును చేశామని భట్టి చెప్పారు.