ఆరు గ్యారెంటీల లెక్క తప్పలే.. ఆ మేరకే కేటాయింపులు చేశాం: భట్టి విక్రమార్క

ఆరు గ్యారెంటీల  లెక్క తప్పలే.. ఆ మేరకే కేటాయింపులు చేశాం: భట్టి విక్రమార్క

 

  • వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్
  • తెచ్చిన అప్పులు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి
  • గత సర్కారు బడ్జెట్ ప్రతిపాదనలు ఎక్కువ ఖర్చు చేసింది తక్కువ
  • 69 రోజుల్లో 23,147 ఉద్యోగాలు ఇచ్చాం
  •  బడ్జెట్ పై ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్: ఆరు గ్యారెంటీల అమలుకు లెక్క  ప్రకారమే కేటాయింపులు చేశామని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ పై చర్చ సందర్బంగా ఆయన మాట్లాడారు. వాస్తవాలకు అనుగుణంగా  బడ్జెట్ రూపొందించామని చెప్పారు. గత సర్కారు బడ్జెట్ లో కేటాయింపులు ఎక్కువ  చేసి ఖర్చు చేయలేదని గణాంకాలతో సహా వివరించారు. దళితబంధులు నిధులు విడుదల చేయాలేదని అన్నారు. తాము బడ్జెట్ లో కేటాయించిన మొత్తంలో 95శాతం ఖర్చు చేసి తీరుతామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 69 రోజుల వ్యవధిలో 23,147 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. వైద్యరంగం, పోలీసుశాఖ, సింగరేణిలో నియామక పత్రాలు అందించినట్టు చెప్పారు.  ఉన్నదాంట్లో సర్దుకుపోయేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి రెండో వేతన సవరణ కోసం ఇద్దరు రిటైర్డ్ అధికారులతో కమిటీ వేశామని, నివేదిక రాగానే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తెచ్చుకుని వినియోగించుకొనే ప్రయత్నం చేస్తామని, ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను వినియోగించిన పథకాలకు ప్రధాన మంత్రి ఫొటోను తప్పక పెడతామని అన్నారు. 

ఆరుగ్యారెంటీలపై పూర్తి  క్లారిటీ కావాలి: కడియం

ఆరు గ్యారెంటీల అమలుకు  పెద్ద ఎత్తున నిధులు కావాలని, కేటాయించింది మాత్రం 53,196 కోట్లని అన్నారు. పథకాల వారీగా కేటాయింపుల వివరాలు తెలుపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. అలాగే నియోజకవర్గానికి 3,500 ఇండ్డు కేటాయిస్తామని చెప్పారని, ఈ లెక్కన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 4 లక్షల 16వేల ఇండ్లు కేటాయించాల్సి ఉంటుందన్నారు. వీటికి 23 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, కేటాయించింది మాత్రం చాలా తక్కువని చెప్పారు.