అలాంటి రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పాలి

అలాంటి రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పాలి

దేశంలో సాంకేతిక విప్లవం గురించి మాట్లాడాల్సి వస్తే రాజీవ్ గాంధీ, శ్యామ్ పిట్రోడా గురించి మాట్లాడకుండా ఉండలేమన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. 21వ శతాబ్దంలో అభివృద్ధి గురించి 30 ఏళ్ల కిందనే ఆలోచించిన మహనీయులు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. 30 ఏళ్ల కింద నిర్వహించిన సద్భావన యాత్రకు గొప్ప ఆలోచన ఉందన్నారు.  దేశంలో మత హింసలు, మనుషుల మధ్య విభేదాలు వచ్చినపుడు ఇలాంటి యాత్రలు మనుషుల మధ్య తోడ్పాటుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

దేశంలో మతాల మధ్య చిచ్చులు రాకుండా ఆపాల్సిన పాలకులు ఇప్పుడు మతాలకు, కులాలకు చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడడం సిగ్గుచేటన్నారు.  అలాంటి రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. ఇలాంటి తరుణంలో దేశ ప్రజలను ఒక్కతాటిపై నడుపుతున్న  రాహుల్ గాంధీనీ కింద పడేసారన్నారు. ఇప్పటికైనా ప్రజలంతా ఒక్కటై పోరాటం చేయాలన్నారు.

జగిత్యాలలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్