యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్

యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్

 

  • రిటైర్ అయినా మరో ఏడాది చాన్స్ 
  • రీ- అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ)గా ప్రభుత్వం జె. భవానీ శంకర్‌‌‌‌‌‌‌‌ను తిరిగి నియమించింది. ప్రస్తుతం అదే పదవిలో కొనసాగుతున్న ఆయన ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మరో ఏడాదిపాటు ఆయనను అదే హోదాలో కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవావారం ఉత్తర్వులు జారీ చేశారు. భవానీ శంకర్‌‌‌‌‌‌‌‌ 2019 బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ అధికారి‌‌‌‌‌‌‌‌.

పదవీవిరమణ సమయంలో ఆయన తీసుకున్న చివరి వేతనం నుంచి పెన్షన్‌‌‌‌‌‌‌‌ మొత్తాన్ని మినహాయించి, మిగిలిన మొత్తాన్ని ఈ ఏడాదిపాటు చెల్లించనున్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, దేవస్థాన పరిపాలనలో ఆయనకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.