సామాజిక సందేశంతో ది ఇండియా స్టోరీ మూవీ..

సామాజిక సందేశంతో ది ఇండియా స్టోరీ మూవీ..

కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే లీడ్ రోల్స్‌‌లో రూపొందుతున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను విడుదల చేశారు.  యోగేష్‌‌ పాటిల్‌‌ (శ్రేయాస్ తల్పడే) ఏడేళ్ల కూతురు హత్యకు గురైందంటూ కోర్టులో అడ్వకేట్‌‌ అర్చన (కాజల్‌‌) తన వాదన వినిపిస్తోంది. 

అయితే క్యాన్సర్‌‌‌‌తో పాప మరణించగా అది హత్య ఎలా అవుతుందని జడ్జి ప్రశ్నిస్తారు. పెస్టిసైడ్ ఫార్మింగ్‌‌ నుంచి వచ్చిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్లే పాప చనిపోయిందని, అందుకు కారణమైన పెస్టిసైడ్‌‌ కంపెనీలు, వాటికి అనుమతించిన ప్రభుత్వం కూడా ఇందులో నేరస్థులని ఆమె వాదిస్తుంది. 

హరిత విప్లవం పేరుతో విషతుఫాను కమ్ముతోందని  శ్రేయాస్ తల్పడే చెబుతాడు.  దీంతో సాధారణ రైతులు మొదలు పెస్టిసైడ్‌‌ కంపెనీల వరకు వీళ్లిద్దరిపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. టీజర్‌‌‌‌ రిలీజ్ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ ‘బలమైన సామాజిక సందేశంతో రూపొందిన సినిమా ఇది. 

ఓ తల్లిగా ఈ కథకు పర్సనల్‌‌గా కనెక్ట్‌‌ అయ్యాను’ అని చెప్పింది.  జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.