‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ఏగన్, ఫెమినా జార్జ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘హృదయానికి హత్తుకునే ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులకు చక్కని థియేట్రికల్ ఫీల్‌నిచ్చే సినిమాగా తెరకెక్కించాం. ముందుగా అనుకున్న ప్లానింగ్ ప్రకారం నాలుగు షెడ్యూళ్లలో 90 రోజుల చిత్రీకరణ పూర్తి చేశాం. మేం ఊహించిన దానికంటే సినిమా బాగా వచ్చింది’ అని చెప్పారు.
‘‘కథా బలం, యూనివర్సల్ ఎమోషనల్ అప్పీల్‌పై ఉన్న నమ్మకంతో చిత్రీకరణ పూర్తయ్యేలోపే స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాలోని ఎమోషన్స్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి’ అని నిర్మాతలు తెలియజేశారు.
